ఒరాఫో జ్యుయల్స్‌ ఇ-స్టోర్‌ ఆవిష్కరణ

హైదరాబాద్‌: వెండి ఆభరణాల బ్రాండు ఒరాఫో జ్యుయల్స్‌ వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా అక్షయ తృతీయ నాటికి మరో ఆరు కొత్త స్టోర్లను తెరువనున్నట్లు ప్రకటించింది. శనివారం హైదరాబాద్‌లో ఒరాఫో జ్యుయల్స్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ఇ- స్టోర్‌ను బలగం సినిమా నటీ కావ్య కళ్యాణ్‌ రామ్‌తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆ సంస్థ డైరెక్టర్‌ కళ్యాణ్‌ రామ్‌ మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో తమకు ప్రస్తుతం మూడు స్టోర్లు ఉన్నాయన్నారు. వచ్చే మూడేళ్లలో దక్షిణాదిలో 25 స్టోర్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నా మన్నారు. ఇందులో ఫ్రాంచైజీ పద్దతిలో ఔత్సాహికవేత్తలకు అవకాశం కల్పించనున్నామన్నారు. ఫ్రాంచైజీ అవుట్‌లెట్‌కు రూ.1.2 నుంచి రూ.1.5 కోట్ల పెట్టుబడి అవసరం అవుతుందన్నారు. వచ్చే అక్షయ తృతీయ నాటికి హైదరాబాద్‌లో మరో రెండు, వైజాగ్‌, రాజమండ్రి, తిరుపతి తదితర నగరాల్లో కొత్త స్టోర్లను ఏర్పాటు చేయనున్నామన్నారు.

Spread the love