హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన న్యాయవాదులు

నవతెలంగాణ -ఆర్మూర్
హైకోర్టు న్యాయమూర్తి, భవన నిర్మాణ కమిటీ సభ్యుడు జస్టిస్ విజయ్ సేన్ రెడ్డినీ బుధవారం బార్ అసోసియేషన్ న్యాయవాదులు మర్యాదాపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, న్యాయస్థానంలో నూతన భవనం మరియు అదనపు జిల్లా జడ్జి కోర్టును ఏర్పాటు చేయాలని ఖాళీగా ఉన్న ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి నియమించాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సరసం చిన్న రెడ్డి అధ్యక్షతన కార్యవర్గ సభ్యులు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు తులసి దాస్, పండిత్, ఏలేటి గంగాధర్, కిష్టయ్య, కాందేశ్ శ్రీనివాస్, శ్రీధర్, జీవన్, జూనియర్ న్యాయవాదులు అరుణ్, సుకేష్ రాములు గణేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love