ఎల్బీనగర్‌ జంక్షన్‌ పేరు మార్పు…

నవతెలంగాణ – హైదరాబాద్
ఎల్బీనగర్‌ జంక్షన్‌ను.. తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి జంక్షన్‌గా నామకరణం చేస్తూ స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం స్టాండింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 11 అంశాలకు స్టాండింగ్‌ కమిటీ సభ్యులు ఆమోదం తెలిపారు. ఈ స్టాండింగ్‌ కమిటీ సభ్యులు శాంతి సాయిజెన్‌శేఖర్‌, సయ్యద్‌ మిన్హాజుద్ధీన్‌, సమీనా బేగం, అబ్దుల్‌ వాహెబ్‌, మహ్మద్‌ అబ్దుల్‌ ముక్తధర్‌, మహ్మద్‌ రషీద్‌ ఫరాజుద్దీన్‌, వనం సంగీత యాదవ్‌, పండల సతీశ్‌బాబు, ఈఎస్‌ రాజ్‌, జితేంద్రనాథ్‌, టి.మహేశ్వరి తదితరులు పాల్గొని పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్‌ కమిషనర్లు ప్రియాంక అలా, ఈఎన్‌సీ జియాఉద్దీన్‌, సీసీపీ దేవేందర్‌ రెడ్డి, సీఈ దేవానంద్‌, అడిషనల్‌ కమిషనర్‌ విజయలక్ష్మి, జయరాజ్‌ కెనడీ, జోనల్‌ కమిషనర్లు మమత, పంకజ, రవికిరణ్‌, శంకరయ్య, శ్రీనివాస్‌ రెడ్డి, సామాట్‌ అశోక్‌, హౌసింగ్‌ ఓఎస్డీ సురేశ్‌, చీఫ్‌ ఎగ్జామినర్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, చీఫ్‌ ఎంటమాలజిస్ట్‌ డాక్టర్‌ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Spread the love