ఎమ్మెల్యే జన్మదినం పురస్కరించుకొని కేకులు పంపిణీ చేసిన నాయకులు

Leaders distributed cakes to celebrate MLA's birthday

– వీరన్న గుట్ట గ్రామపంచాయతీలో రక్తదాన శిబిరం..

నవతెలంగాణ – రెంజల్
బోధన్ ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన్ రెడ్డి జన్మదిన పురస్కరించుకొని రెంజల్ మండల కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం సాటాపూర్ చౌరస్తాలో, రెంజల్ మండల కేంద్రంలో, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో కేకులు కట్ చేసి పండ్ల పంపిణీ చేశారు. అనంతరం రెంజల్ మండలం వీరన్న గుట్ట గ్రామపంచాయతీలో యువత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి 27 మంది యువత రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొబిన్ ఖాన్, మాజీ జెడ్పిటిసి నాగభూషణం రెడ్డి, మాజీ అధ్యక్షులు సాయి రెడ్డి, సిహెచ్ రాములు, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు సురేందర్ గౌడ్, ఓబిసి మండల అధ్యక్షులు లచ్చేవార్ నితిన్, ధనుంజయ్, జావీద్, రెంజల్ సొసైటీ చైర్మన్ మొయినద్దీన్, శనిగరం సాయి రెడ్డి, గంగా కృష్ణ, సాయిబాబా గౌడ్, షౌకత్, బన్సియా, ఎంఎల్ రాజు, కంఠం గంగారాం, అంజయ్య ,రవి, యువజన నాయకులు కార్తీక్, అబ్బు, గైన కిరణ్, అలీముద్దీన్, పత్తి శ్రీకాంత్, సిద్ధ సాయిలు, సురేష్ పాటిల్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love