నీతి కథల పోటీల కరపత్రం విడుదల

నవతెలంగాణ-తాండూరు
నీతి కథల పోటీల కరపత్రాన్ని మంగళవారం తాండూరు పట్టణ కేంద్రంలోని నేతాజీ హై స్కూల్లో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కోఆర్డినేటర్‌ గూ డూరు హరినాథ్‌, నేతాజీ గురుకుల్‌ హై స్కూల్‌ డైరెక్టర్‌ మణిమాల, ప్రిన్సిపాల్‌ శివలీల విడుదల చేశారు. ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానాలు హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ నిర్వహిస్తున్న కథ చెబు తారా ఊకొడుతాం కార్యక్రమంలో నీతికథల పోటీలను విద్యార్థిని విద్యార్థులకు నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగా తాండూరులోని శ్రీ నేతాజీ గురుకుల్‌ హై స్కూల్‌ లో జూలై 24 వ తేదీ ఉదయం 11 గంటల నుంచి ఈ నీ తి కథల పోటీలు ప్రారంభింస్తామన్నారు. 5-10 ఏండ్లు లోపు విద్యార్థులు జూనియర్స్‌, 10-15 ఏండ్ల లోపు విద్యా ర్థులు సీనియర్స్‌గా 2 విభాగాలుగా పోటీలు నిర్వహిస్తా మన్నారు. ప్రతి ఒక్కరూ ఏదైనా రామాయణ భారత భాగ వత చారిత్రకమైన కథల 2-5 నిమిషాల లోపల కథ చెప్పాల్సి ఉంటుందన్నారు. మరింత సమాచారం కోసం 9030850336 కు సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో నేతాజీ గురుకుల్‌ హై స్కూల్‌ డైరెక్టర్‌ మణిమాల, టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ కోఆర్డినేటర్‌ గూడూరు హరినాథ్‌, ప్రిన్సిపల్‌ శివలీల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love