
సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) పత్రాల డాటా ఎంట్రీలో ఎలాంటి తప్పులకు చోటు ఇవ్వద్దని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) డాటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఈనెల 21 నుండి 27 వరకు వారం రోజుల్లో డాటా ఎంట్రీ పూర్తి చేయాలని ఆపరేటర్లకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో గా డాటా ఎంట్రీ పూర్తయ్యేందుకు ఆపరేటర్లు సహకరించాలని కోరారు.అనంతరం ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు సంతోష్, అరవింద్ డాటా ఎంట్రీ ఆపరేటర్లకు శిక్షణను ఇచ్చారు.కార్యక్రమంలో తహసిల్దార్ ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.