మన పాలన మనమే చేసుకుందాం

– ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌
నవతెలంగాణ-ధారూరు
‘మన పాలన మనమే చేసుకుందాం’ అని ఎమ్మె ల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ అన్నారు. ఎమ్మెల్యే సమ క్షంలో మండల పరిధిలోని మున్నూరు సోమారం గ్రా మానికి చెందిన కాంగ్రెస్‌ వార్డు మెంబర్‌ బైండ్ల శ్రీశై లం విద్యా కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ సీనియ ర్‌ నాయకులు సంగమేశ్వర్‌, గోపాల్‌, అనంతయ్య, కిష్టయ్య, ఎల్లయ్య, వీరేశం, రమేష్‌, కాచారం నుండి వ డ్ల శ్రీకాంత్‌, రాములు, అక్బర్‌, అల్లావుద్ధిన్‌, మల్లేష్‌, శ్రీనివాస్‌, ధర్మాపూర్‌ నర్సిములు, గోవర్ధన్‌, శ్రీనివాస్‌, కొండారెడ్డి, అమరేందర్‌ రెడ్డి, యాదయ్య వారి అనుచరులు కాంగ్రెస్‌, బీజేపీల నుండి 60 మంది బీ ఆర్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు. వికారాబాద్‌ నుండి గతంలో స్థానికేతరులకు అవకాశ మిచ్చి నష్టపోయామని, ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే అభివృద్ధిని చేసుకోలేకపోయామ న్నారు. కాబట్టి ‘మన ప్రాంతంలో మనమే పాలన చేసుకుందాం’ అని అన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదిత రులు పాల్గొన్నారు.

Spread the love