Monday, April 27, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపరస్పరం సహకరించుకుందాం

పరస్పరం సహకరించుకుందాం

- Advertisement -

యూఏఈ అధ్యక్షుడితో అజిత్‌ ధోవల్‌ భేటీ
ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం, ఇంధన భద్రత సహకారంపై చర్చ
అబుదాబి :
భారత్‌, యూఏఈలు పరస్పరం సహకరించుకుందామని, ఆ దేశ అధ్యక్షుడు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ను జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ ధోవల్‌ కోరారు.. అబుదాబిలో జరిగిన భేటీలో ప్రాంతీయ పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ఇంధన భద్రతపై సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఇరుపక్షాలు చర్చించాయి.
యూఏఈ అధ్యక్షుడు హెచ్‌హెచ్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ను జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ ధోవల్‌ కలిశారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసే చర్యలు, ప్రాంతీయ పరిస్థితి, పరస్పర ఆసక్తి ఉన్న ఇతర అంశాలపై చర్చించారు” అని యూఏఈలోని భారత రాయబార కార్యాలయం ఒక పోస్ట్‌ చేసింది.

ఈ సమావేశానికి అబుదాబి యువరాజు షేక్‌ ఖలీద్‌ బిన్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌, సుప్రీం కౌన్సిల్‌ ఫర్‌ నేషనల్‌ సెక్యూరిటీ సెక్రెటరీ జనరల్‌ అలీ బిన్‌ హమ్మద్‌ అల్‌ షమ్సీ కూడా హాజరయ్యారు. ఒక నెలలో ఇరు దేశాల మధ్య ఇది రెండో ఉన్నత స్థాయి సమావేశం. ఈ నెల ప్రారంభంలో విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ తన రెండు దేశాల పర్యటనలో భాగంగా యూఏఈ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చలు బలంగా ఉన్నాయని, భారత్‌-యూఏఈ వ్యూహాత్మక భాగస్వామ్యం పటిష్టంగా ఉందని జైశంకర్‌ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -