ఆరోగ్యం మీద చాలా మందికి శ్రద్ధ పెరిగింది. డైట్ విషయంలో చాలా రకాల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే డైట్‌లో నిర్దిష్టమైన నియమాలు, కఠినమైన పద్ధతులు ఉంటుంటాయి. వాటిని ఫాలో కాలేక, ఆ ఫుడ్ తినలేక కొందరు పూర్తిగా డైటింగ్ మానేస్తూ ఉంటారు. అలాంటి వారు ఎలాంటి కఠినమైన నియామాలు ఫాలో అవ్వకుండా.. హెల్తీగా, ఫిట్‌గా ఉండటానికి ఫ్లెక్సిటేరియన్ డైట్ సహాయ పడుతుంది. అదేంటి అంటే… సౌకర్యవంతమైన ఆహారం తీసుకోవడం… ఈ డైట్‌లో కొన్ని బేసిక్ రూల్స్ తప్ప నిర్ధిష్టంగా పాటించాల్సిన నియమాలు లేవు. ఏ ఆహారాన్ని పూర్తిగా మానేయకుండా సమపాళ్లలో బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. ఈ డైట్‌లో మాంసాహారం మితంగా తీసుకుంటూ, ఎక్కువ కూరగాయలతో నిండిన ఆహారం తినడమన్న మాట. పండ్లు, కూరగాయలు, తణధాన్యాలు ఎక్కువగా, మాంసం మితంగా తినాలి. చికెన్, చేపలు వంటి లీన్ ప్రొటీన్ మాంసం తీసుకోవచ్చు. ఫ్లైక్సిటేరియన్ డైట్ తీసుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలుంటాయో తెలుసుకుందాం.
బరువు అదుపులో… : ఫ్లోక్సిటేరియన్ డైట్ ఎక్కువగా.. కాయగూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ సమద్ధిగా ఉంటుంది. ఫైబర్ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. అందువల్ల ఆహారం తక్కువ తీసుకుంటార. ఈ ఫైబర్ రిచ్ ఫుడ్ ఆహారం అతిగా తినకుండా నిరోధిస్తుంది. తద్వారా బరువు కంట్రోల్‌లో ఉంటుంది. అంతేకాదు, ఇందులో ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియ సమస్యలను దూరం చేస్తుంది.
పదిలమైన గుండె : ఫ్లెక్సిటేరియన్ ఆహారం రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవడం వల్ల.. గుండె సమస్యల ముప్పు తగ్గుతుంది.
దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తక్కువ : ఈ డైట్‌ను ఫాలో అవ్వడం వల్ల శరీరానికి విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమద్ధిగా అందుతాయి. డయాబెటిస్, క్యాన్సర్, హైపర్‌టెన్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
పెరిగే శక్తి స్థాయిలు : ఈ ఆహారాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి ఇన్ఫెక్షన్లు, అనారోగ్యాల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.
మానసిక ఆరోగ్యం : మెదడు ఆరోగ్యానికి పోషకాలు అవసరం. మెదడు పనితీరు, మానసిక స్థితి, మొత్తం మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి తోడ్పడతాయి.