సీతారాం ఏచూరి ఆశయాలు సాదిద్దాం

Let's fulfill Sitaram Yechury's ambitions– విద్యార్ధి సంఘ నాయాకుల నివాళి
నవతెలంగాణ –  కామారెడ్డి
సీతారామయ్య చౌరి ఆశయాలను కొనసాగిద్దామని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. సిపిఎం ప్రధాన కార్యదర్శి మాజీ ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు సీతారాం ఏచూరి కి కామారెడ్డి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించరు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు  ఆయన మరణం పట్ల ద్విగ్బాంత్రి వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి జోహార్లు అర్పిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ సీతారాం ఏచూరి  విద్యార్థి దశ నుండే పేద ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన, విద్యార్థుల పక్షాన నిలబడి పోరాడారని అన్నారు. ఈ దేశంలో కమ్యూనిస్టుగా గొప్పగా  నాయకుడుగా ఎదిగి ఎందరికో మార్గదర్శకంగా నిలిచారని అన్నారు. ఈ దేశం సీతారాం ఏచూరి  ని కోల్పోవడం అంటే గొప్ప మేధావిని కోల్పోయినట్లే అని అన్నారు. ఆయన మరణం ఈ దేశానికి తీరని లోటు అని అన్నారు. ఢిల్లీ జేఎన్యు విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం ఎన్నికలలో మూడుసార్లు గెలిచిన ఘనత సీతారాం ఏచూరి గారిదని అంతేకాకుండా ఉత్తమ పార్లమెంటేరియన్ గా కూడా ఆయనకు అవార్డు వచ్చిందన్నారు. ఆయన ఈ దేశానికి అందించిన సేవలు కార్మికులోకానికి చేసిన కృషి మరువలేనిది అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ మాజీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు విజయరామరాజు, బివిఎం రాష్ట్ర కార్యదర్శి విట్టల్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ముదాం అరుణ్, పి డి ఎస్ యు రాష్ట్ర కోశాధికారి  సురేష్, నాయకులు అభిలాష్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love