పల్లెకు పోదాం వైద్యం అందజేస్తాం..

– ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బి ఎన్ రావు
నవతెలంగాణ -సుల్తాన్ బజార్
తెలంగాణలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లి ఉచితంగా ప్రజలకు వైద్యం అందించేందుకు ఐఎంఏ పల్లెకు పోదాం వైద్యం అందజేస్తాం అనే కార్యక్రమం చేపట్టిందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బిఎన్ రావు అన్నారు. ఆదివారం కోఠి లోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలోని డాక్టర్ జీకే కిర్లోస్కర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నేషనల్ ఐఎంఏ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా రెండు వేల ఐఎంఏ బ్రాంచీలు ఉన్నాయని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో ఆవోగాం ప్రోగ్రాం తో ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ముందుకు వచ్చి మారుమూల ప్రాంతాల్లో ఆవోగాం పేరిట పల్లెల్లో వైద్య సేవలు అందించేందుకు శ్రీకారం చుట్టామని ఆయన తెలిపారు. గ్రామాలను దత్తత తీసుకొని అక్కడి ప్రజలకు వైద్య సేవలు అందజేస్తున్నామన్నారు. ఎంపిక చేసుకున్నదత్తత గ్రామాల లో ఐఎంఏ తరపున మెడికల్ క్యాంపులు నిర్వహించి గ్రామ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తామన్నారు. రాష్ట్రంలో 75 ఐఎంఏ బ్రాంచీలు ఇప్పటివరకే 200 గ్రామాలను దత్తత తీసుకొని ఆదివారం గ్రామాల్లో ప్రజలకు వైద్యం అందించే చర్యలు చేపట్టాయి అని చెప్పారు. వైద్యంతో పాటు అన్ని రకాల రక్త పరీక్షలు. మందులను ఉచితంగా అందిస్తున్నాయన్నారు. ఐఎంఏ సామాజిక బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య పరంగా తీసుకుని నిర్ణయాల్లో ఐఎంఏను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని సలహాలు అందించేందుకు ఐఎంఏ సిద్ధంగా ఉందని చెప్పారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ జె విజయ్ రావు. స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీ డాక్టర్ రాజేందర్ కుమార్ యాదవ్. ఫాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం సంపత్ రావు. డాక్టర్ కిషన్. డాక్టర్ భవాని. డాక్టర్ గుత్తా సురేష్. డాక్టర్ కృష్ణారెడ్డి. డాక్టర్ జి సంపత్ డాక్టర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love