గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిరక్షణకు ఉద్యమిద్దాం

నవతెలంగాణ-నిజాంపేట
జాతీయ గ్రామిణ ఉపాధి హమి పధకాన్ని ఎత్తివేతకు కేంద్రప్రభుత్వం చేస్తున్న కుట్రను ప్రతిఘటించాలని ఉపాధి హమి చట్ట పరిరక్షణకు ఉద్యమించాలని దళిత బహుజన ఫ్రంట్‌ జిల్లా అధ్యక్షుడు దుబాషి సంజివ్‌ కోరారు. శుక్రవారం నిజాంపేట మండల పరిధిలోని నస్కల్‌ గ్రామంలో ఉపాధి హమి పరి రక్షణ కరపత్రాలను విడుదల చేసి కూలీల సమస్యలు తెలుదుకున్నారు. ఈ సందర్బంగా సంజీవ్‌ మాట్లాడుతూ ఈ నెల 25 న హైదరాబాద్‌ లో ఉపాధి హమి పరి రక్షణ రాష్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ఎనిమిది ఏళ్ళుగా కేంద్ర బడ్జెట్‌ లో నిధులను తగ్గిస్తు పధకాన్ని నీరు గారుస్తున్నారన్నారు. .చేసిన పనికి వారం రోజులలో చెల్లించాల్సిన వేెతనాలు ఆరు నెలలైన చెల్లించకుండ శ్రమ దొపిడికి పాల్పడుతున్నారన్నారు. సమ్మర్‌ అలవెన్స్‌ చెల్లించడం లేెదన్నారు. ఉపాధిహమి పట్టణాలలో గహ కార్మికులు,చెత్త ఎరె కార్మికులు భవన నిర్మణ కార్మికులకు పని దొరకక పస్తులు వుంటున్నందున పట్టణ పేదలకు ఉపాది హమి పని కల్పించాలని డిమాండ్‌ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ చట్ట పరిరక్షణ కోసం జరుగుతున్న దశల వారి ఆందోళనా, పోరాటాలలో కూలీలు, ప్రజాసంఘాలు, మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. పని చూపని దగ్గర జాబ్‌కార్డుదారులకు చట్ట ప్రకారం నిరుద్యోగభృతి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఫీల్డ్‌ అసిస్ట్ణేంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం జరుగుతున్న ఉద్యమంలో కూలీలు, మేధావులు, ప్రజాసంఘాలు భాగస్వామ్యం కావాలని కోరారు.

Spread the love