కేసీఆర్‌ కుటుంబ దోపిడీని ఆపుతాం

– ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తాం
– ఏఐసీసీ కార్యదర్శి పీసీ విశ్వనాథ్‌
నవతెలంగాణ-భువనగిరి
తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్న కెసిఆర్‌ కుటుంబ దోపిడీని ఆపుతామని దోపిడీకి గురైతున్న బడ్జెట్‌ తోనే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని ఏఐసీసీ కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ సహా ఇన్‌చార్జ్‌ పీసీ.విష్ణునాద్‌ అన్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు భువనగిరి నియోజకవర్గానికి విచ్చేసి డీసీసీ అధ్యక్షులు అండెం సంజీవరెడ్డి , పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్‌ ప్రమోద్‌ కుమార్‌, నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పంజాల రామాంజనేయులు గౌడ్‌, జిట్టా బాలకష్ణారెడ్డి,తదితరులతో కలిసి పట్టణంలోని ప్రభుత్వ రహదారి బంగ్లాలో విలేకరులతో మాట్లాడాతూ ుక్కుగూడ కాంగ్రెస్‌ పార్టీ విజయభేరి సభ విజయవంతమైందని సభ విజయవంతానికి కషిచేసిన ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు కతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్రంలో రాబోవు కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయంలో చేయబోవు 6 గ్యారంటీ పథకాలను విడుదల చేయడం జరిగిందన్నారు. ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ఇస్తామని హామీ ఇచ్చి ఇచ్చామో అదేవిధంగా కచ్చితంగా ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామన్నారు. దీనికి నిదర్శనం కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసి చూపిస్తున్న తీరే నిదర్శనమన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి కుటుంబంలోని మహిళకు నెలకు రూ. 2500, రూ. 500 కే గ్యాస్‌, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. రైతు భరోసా పథకం ద్వారా రైతులు కవులు రైతులకు ఎకరాకురూ. 15వేల రూపాయల పెట్టుబడి సహాయం, వరి పంటకు క్వింటాలుకు రూ. 500 బోనస్‌, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేల ఆర్థిక సహాయం గహజ్యోతి పథకం ద్వారా గహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తుఇందిరమ్మ ఇంటి పథకం ద్వారా ఇంటి నిర్మాణానికిరూ. 5 లక్షలుఆర్థిక సహాయంయువ వికాస పథకం ద్వారా విద్యార్థులకు 5 లక్షలతో విద్యా భరోసా కార్డు, చేయూత పెన్షన్‌ ద్వారా ఆసరా పెన్షన్‌ రూ. 4000 పెంపు ఈ ఆరు గ్యారెంటీ పథకాలు కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మరియు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు బూత్‌ లెవెల్‌ నుండి ఏఐసీసీ, సీడబ్ల్యుసి వరకు అన్ని స్థాయిలో ఉన్న నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పనిచేస్తున్నామని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 119 మంది ఏఐసిసి నాయకులు ఒకేరోజు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. అనంతరం పట్టణంలోని 27 వాడు జలీల్‌ పుర ప్రాంతంలో ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి బిర్ల ఐలయ్య, పీసీసీ సభ్యులు తంగల్లపల్లి రవికుమార్‌, పోతంశెట్టి వెంకటేశ్వర్లు,పచ్చిమట్ల శివరాజ్‌ గౌడ్‌, బర్రె జహంగీర్‌, ఎలిమినేటి కష్ణారెడ్డి, దర్గాయి హరిప్రసాద్‌, బర్రె నరేష్‌, ఎండి బబ్లు, ఎండీ అవేస్‌ చిస్థి, పిట్టల బాలరాజు, నీలం పద్మ, గొద రాహుల్‌ గౌడ్‌, కౌన్సిలర్స్‌ ఎండీ నాజిమా సలావుద్దీన్‌, కైరం కొండ వెంకటేష్‌, ఈరపాక నరసింహ, పడిగల ప్రదీప్‌, చిక్కుల వెంకటేష్‌, కూర వెంకటేష్‌, కొల్లూరి రాజు, దర్గాయి దేవేందర్‌, వాకిటి అనంతరెడ్డి, గోధ శ్రీనివాస్‌ గౌడ్‌, కుక్కదూగు సోమయ్య, ఎండీ మజర్‌, రఫీయోధ్దిన్‌, పాల్గొన్నారు.

Spread the love