కడెం ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తివేత..

నవతెలంగాణ- నిర్మల్: భారీ వర్షాల కారణంగా కడెం ప్రాజెక్టుకు భారీ వరద వస్తుండగా 11 గేట్లు ఎత్తి నీటిని కిందకి వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 696.25 అడుగులు కొనసాగుతుంది. ఇన్ ఫ్లో ప్రాజెక్టులోకి 186200 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా 136291 క్యూసెక్కుల వరద నీటిని బయటకి వదులుతున్నారు.

Spread the love