ఏపీలో 19న స్థానిక సంస్థల ఉపఎన్నికలు

నవతెలంగాణ – హైదరాబాద్
ఏపీ ప్రజలకు అలర్ట్..ఏపీ ఈ నెల 19న స్థానిక సంస్థల ఉపఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 66 సర్పంచ్ స్థానాలు, 1064 వార్డు సభ్యుల స్థానాలకు ఆగస్టు 19న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు మరణించడం లేదా రాజీనామా చేయడం వల్ల ఖాళీలు ఏర్పడ్డాయి. 19న ఉ. 7 నుంచి మ. 1 వరకు పోలింగ్, మ. 2 నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపింది. కాగా, సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నేడు ఒకే నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పోలవరం నియోజకవర్గం పరిధిలో ఉన్న కూనవరం మండలంలో సీఎం జగన్ వరద బాధితులను పరామర్శించనున్నారు. అలాగే చింతలపూడి, పట్టిసీమ మీదుగా పోలవరం ప్రాజెక్టు సందర్శనకు చంద్రబాబు వెళ్లనున్నారు. మరోవైపు రాత్రికి ఇరువురు నేతలు రాజమండ్రిలో బసచేయనుండడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Spread the love