మాజీ ఎమ్మెల్యే షకీల్‌పై లుక్ ఔట్ నోటీసులు..

నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ చేసిన యాక్సిడెంట్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే షకీల్ కొడుకు రాహిల్‌పై పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేయగా.. తాజాగా మాజీ ఎమ్మెల్యే షకీల్‌పైన పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. కాగా, బోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్ ర్యాష్ డ్రైవింగ్ చేసి హైదరాబాద్‌లోని ప్రజా భవన్ ముందున్న బారికేడ్లను ఢీకొట్టాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. షకీల్ ఈ కేసు నుండి తన కొడుకును తప్పించడానికి ప్రయత్నించడంతో పోలీసులు ఆయనను నిందితుడిగా చేర్చారు.

Spread the love