Sunday, May 17, 2026
E-PAPER
Homeక్రైమ్పాలమూరులో ప్రేమోన్మాదం

పాలమూరులో ప్రేమోన్మాదం

- Advertisement -

యువతి గొంతు కోసి హత్య చేసిన యువకుడు
నవతెలంగాణ- జడ్చర్ల
ప్రేమ పేరుతో వెంటబడుతూ వేధిస్తున్న ఓ యువకుడు యువతిని కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన శనివారం సాయంత్రం మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్ల పట్టణంలోని నిమ్మబావిగడ్డ ప్రాంతానికి చెందిన వైష్ణవి(23) పోలేపల్లి సెజ్‌లోని ఎస్వీకేయం పాఠశాలలో విధులు నిర్వహిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన రామచందర్‌ ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో రోజులాగే విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న వైష్ణవిని శనివారం సాయంత్రం అడ్డగించాడు. ఆమె ఇంటి సమీపానికి చేరుకున్న సమయంలో వెంట తెచ్చుకున్న కత్తితో యువకుడు విచక్షణారహితంగా దాడి చేసి గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావంతో యువతి అక్కడికక్కడే మృతిచెందింది. గమనించిన స్థానికులు పారిపోతున్న నిందితుడిని పట్టుకొని చితకబాదారు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడిన యువకుని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -