27 అడుగులకు చేరిన లక్నవరం నీరు..

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రము లక్నవరం చెరువు సోమవారం నాటికి 27 అడుగులకు మీరు చేరుకుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. చెరువు పూర్తిస్థాయి నీటిమట్టం 33 అడుగులు కాగా  ప్రస్తుతం తుఫాన్ ప్రభావం కొనసాగుతున్నందున మరో మూడు రోజులపాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ మూడు రోజుల వ్యవధిలో మరో ఆరు అడుగుల నీరు చేరితే మత్తడి పడుతుందని అంటున్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్ ప్రారంభంలో 25 రోజులపాటు వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. ఒక దశలో కాలం అవుతుందో కాదో అన్న సందేహం రైతులను వెంటాడింది. గత 15 రోజులుగా తుఫాన్ నల పుణ్యమా అని ఏకధటిగా వర్షాలు కురవడంతో చెరువులు కుంటల్లోకి నీరు సమృద్ధిగా చేరింది. రైతులు కూడా వ్యవసాయ పనులను ముమ్మరంగా ప్రారంభించారు. ఇప్పుడు రెండు పంటలకు డొక లేదన్న అభిప్రాయంలో రైతులు ఉన్నారు.

Spread the love