మద్నూర్ మండల శాలివాహన సంఘం కార్యవర్గం ఎన్నిక

నవతెలంగాణ – మద్నూర్
కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండలం కుమ్మర( శాలివాహన ) సంఘం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు కుమ్మరి రాములు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో కుమ్మరులను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తూ అందులో భాగంగా మండల కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆదివారం మద్నూర్ మండల కేంద్రంలోని జివిఆర్ కళ్యాణ మండపంలో మండల కులస్తుల సమక్షంలో మండల కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా కొడిచల్ర గంగాధర్, అధ్యక్షులుగా విజయ్ కుమార్, ఉపాధ్యక్షులుగా సంజు, ప్రధాన కార్యదర్శిగా విఠల్, కోశాధికారిగా సచిన్, సహాయ ఉపాధ్యక్షులుగా అశోక్, సలహాదారులుగా లక్ష్మణ్, వీరన్న తదితరులను ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడితో పాటు ప్రధాన కార్యదర్శి మోహన్ జిల్లా ఉపాధ్యక్షులు ధర్పల్లి శివకుమార్ మద్నూర్ మండల కుమ్మర ( శాలివాహన ) కులస్తులు గంగాధర్, చిన్న వీరేశం హనుమాన్లు, అశోక్ సాయినాథ్ రామ్ మారుతి తదితరులు పాల్గొన్నారు.

Spread the love