ఎంపీడీవో విజయలక్ష్మి
నవతెలంగాణ-యాచారం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు జరిగే రైతు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో విజయలక్ష్మి సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని చౌదర్పల్లి, యాచారం, మేడిపల్లి రైతు వేదికల ముస్తాబును ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తలపెట్టిందని తెలిపారు. నేడు ఉదయం 9 గంటల సమయంలో రైతు దినోత్సవం నిర్వహించేందుకు రైతు వేదికలను ముస్తాఫ్ చేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా ప్రతినిధులు, అధికారులు, కింది స్థాయి సిబ్బంది సకాలంలో హాజరు కావాలని ఆమె పేర్కొన్నారు.