మహా ధర్నాను విజయవంతం చేయండి.. 

Make the Maha Dharna a success..– ఎఐకెఎంఎస్ రాష్ట్ర నాయకులు ఆకుల పాపయ్య పిలుపు..
నవతెలంగాణ – డిచ్ పల్లి
కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26 న దేశవ్యాప్తంగా జరిగే నిరసన ప్రదర్శనలో రైతులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు ఆకుల పాపాయ్య పిలుపునిచ్చారు. మంగళవారం ఎఐకెఎంఎస్  ఆధ్వర్యంలో డిచ్ పల్లి మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆకుల పాపయ్య మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలు చేపడుతుందని అన్నారు. వ్యవసాయ రంగంలో  తెచ్చిన మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతాంగం ఉద్యమం నడిచిందని రైతు ఉద్యమానికి ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పి లిఖిత పూర్వకంగా వారి డిమాండ్లను నెరవేస్తామని ఇచ్చిన హామీని అమలు పరచడం లేదని వారన్నారు. ముఖ్యంగా ఎంఎస్పి మద్దత్తు ధరల గ్యారంటీ చట్టాన్ని పార్లమెంట్ లో తీసుకవస్తామని, విద్యుత్ సవరణ బిల్లులను ఉపసంహరిస్తామని, రైతులపై మోపబడిన కేసులన్నిటిని ఎత్తివేస్తానని ఉద్యమం లో చనిపోయిన 756 రైతు కుటుంబ లకు ఎక్సగ్రెషియా చెల్లిస్తానని తదితర హామీలను అమలు చెయ్యడం లో మోదీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
దీనితో పాటు కార్మికులు పోరాడి సాధించుకున్న 44చట్టాలను 4 కొడ్ లుగా కుదించి వారి హక్కులను కాలరస్తున్నారని, కార్మికులకు ఉద్యోగ భద్రత, ఉపాధి అవకాశలపై దెబ్బ కొడుతున్న మోదీ ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహారించుకోవాలనే డిమాండ్ తో ఎస్ కె ఎం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశ వ్యాపితంగా ఈ నెల 26 న నిరసన ర్యాలీలు జరుపుతున్నారని వారు అన్నారు.  జిల్లా కేంద్రంలో ఈ నేలా 26 న ధర్నా చౌక్ లో నిర్వహించే ధర్నాను విజయవంతం చెయ్యడానికి గాను రైతు కూలీలు, కార్మికులు ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని పాపయ్య కోరారు. ఈ సమావేశం లో ఎఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, రైతు నాయకులు మచ్చర్ల నాగయ్య,పివైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు వాసరి సాయినాథ్ , నాయకులు దేవా స్వామి తదితరులు పాల్గొన్నారు.
Spread the love