సమినార్‌ను జయప్రదం చేయండి

నవతెలంగాణ-కోదాడరూరల్‌
హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈనెల 6న నిర్వహించే వానాకాలం వ్యవసాయంపై సాగు అనే అంశంపై జరిగే సెమినార్‌ను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సెమినార్‌కు ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ ప్రభాత్‌ పట్నాయక్‌, ఏఐకేఎస్‌ సెక్రటరీ డాక్టర్‌ విజూ కృష్ణన్‌, డాక్టర్‌ దేవీప్రసాద్‌ జువ్వాడి, ప్రొఫెసర్‌ అల్దాఫ్‌ జానయ్య, ఏఐకేఎస్‌ సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజాతంత్ర వాదులు, రైతు సంఘం నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జుట్టుకొండ బసవయ్య, పట్టణ కార్యదర్శి ముత్యాలు, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Spread the love