మండలంలోని రెడ్డి పేటలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సంఘ సభ్యులు మౌన దీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు నాయిని నరసింహులు మాట్లాడుతూ… రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పిలుపుమేరకు, కార్పొరేషన్ కు రూ రూ.5 వేల కోట్లు కేటాయించాలని, డైరీ, పౌల్ట్రీ ఫామ్ లకు మున్నూరు కాపులకు సబ్సిడీ పై లోన్లు అందజేయాలని, మున్నూరు కాపులకు ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు అందజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎం బేరి లింబద్రి, ప్రధాన కార్యదర్శి గోపు నర్సింలు, కోశాధికారి శెట్టిపల్లి నారాయణ, ముఖ్య సలహాదారులు ఎం లింగయ్య, గోపు గంగారాం, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.