రిపేర్ షెడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన మేయర్ 

నవతెలంగాణ – కంటేశ్వర్
నగరంలోని ఖిల్లా ఫిల్టర్ బెడ్ ప్రాంతంలో మున్సిపల్ వాహనాల మరమ్మతుల కోసం షెడ్ నిర్మాణానికి నగర మేయర్ దండు నీతూ కిరణ్
మున్సిపల్ కమిషనర్ తో కలిసి భూమి పూజ చేసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ దండు నీతూ కిరణ్ మాట్లాడుతూ.. మున్సిపల్ కార్పొరేషన్ వాహనాల నిర్వహణ కోసం అవసరమైన చిన్న చిన్న రిపేర్లు చేయుటకు రూ.43లక్షల రూపాయల నిధులతో షెడ్ నిర్మాణం చేయటం జరుగుతుందని తెలిపారు. రోజువారీ చెత్త తరలింపు చేసే వాహనాలు, నీటి సరఫరా వాహనాలకు ఏదైనా రిపేర్లు వచ్చినట్లయితే షో రూమ్ లలో చేయించటం ద్వారా సమయం వృథా కావటమే కాకుండా నగరంలో చెత్త నిర్వహణపై ప్రభావం పడుతున్నందున చిన్న చిన్న రిపేర్లు చేయుటకు వీలుగా షెడ్ నిర్మాణం చేస్తున్నామని పనుల్లో జాప్యం జరగకుండా ఉండేందుకు తీసుకోవలసిన అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఇల్లందుల మమత, మున్సిపల్ డిప్యూటి ఇంజనీర్ ఆనంద్ సాగర్, అసిస్టెంట్ ఇంజినీర్ ఇనాయత్ కరీం తదితరులు పాల్గొన్నారు.
Spread the love