భయంతో యువకుడు ఆత్మహత్య
కట్టంగూర్ మండలం మునికుంట్లలో ఘటన
గ్రామంలో పోలీసు బందోబస్తు
నవతెలంగాణ-కట్టంగూరు
వైద్య వృత్తిలో రాణించాలని పట్టుదలతో చదివి మెడిసిన్‌లో చేరిన విద్యార్థిని.. ఓ యువకుడి వేధింపులకు బలైంది.. ప్రేమించాలంటూ వెంటపడటం.. వేధించడంతో భరించలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ విషయం తెలిసి భయంతో సదరు యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం మునికుంట్ల గ్రామంలో జరిగింది. శాలిగౌరారం రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ మునుగోటి రవిందర్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. మునుకుంట్ల గ్రామానికి చెందిన సుక్క లింగయ్య యాదమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె లక్ష్మిప్రియాంక హైదరాబాదులోని సెంట్రల్ యానివర్శిటీలో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ కోర్సు చదువుతున్నది. సుక్క లింగయ్య ఢిల్లీలో తెలంగాణ భవన్‌లో టెలికాం డిపార్ట్ మెంట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. చిన్న కూతురు లక్ష్మి ప్రసన్న(21) సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యనభ్యసించేది. రెండు నెలలుగా స్వగ్రామం నుంచి రోజూ బస్సులో కళాశాలకు వెళ్లి వస్తోంది. అదే గ్రామానికి చెందిన చిలుముల రాంచరణ్(25) ఏడాది నుంచి లక్ష్మిప్రసన్నను ప్రేమ పేరుతో వేధించాడు.ఇటీవల వేధింపులు ఎక్కువ అయ్యాయి. ఈ నెల 17న లక్ష్మి ప్రసన్న మధ్యాహ్నం 1.20 సమయంలో తన అక్క లక్ష్మి ప్రియాంకకు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని అడగ్గా.. హైదరాబాద్ నుంచి ఇంటికి వస్తున్నాని ఆమె చెప్పింది. ఆ తర్వాత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అక్క సాయంత్రం ఇంటికి వచ్చే సరికే తలుపు మూసి ఉంది. దాంతో తలుపులను గట్టిగా నెట్టి లోపలికెళ్లి చూసేసరికి లక్ష్మి ప్రసన్న ఉరికి వేలాడూ కనిపించింది. చుట్టుపక్కల వారి సాయంతో కింది దింపి 108కు ఫోన్ చేశారు. 108 సిబ్బంది వచ్చి పరిశీలించి అప్పటికే మృతిచెందినట్టు ధృవీకరించారు.
భయంతో యువకుడి ఆత్మహత్య..
సుక్క లక్ష్మి ప్రసన్న మృతిచెందిన విషయం తెలిసి తీవ్ర భయాందోళనకు గురైన రాంచరణ్ శుక్రవారం రాత్రి తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. అక్కడ తన తండ్రి సమాధిపై రక్తంతో చరణ్, చిన్నారి(లక్ష్మి ప్రసన్న నిక్ నేమ్) అని రాశాడు. ఆ తర్వాత తాటి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
యువకుడిని పలుమార్లు మందలించినా…
చిలుముల రాంచరణ్ ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని చెల్లి లక్ష్మిప్రసన్న పలుమార్లు నా దృష్టికి తీసుకొచ్చిందని లక్ష్మి ప్రియాంక తెలిపారు. ఇదే విషయమై ఆ యువకుడిని అనేక సార్లు మందలించినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవటం వల్ల వేధింపులు భరించలేక తన చెల్లి ఆత్మహత్య చేసుకున్నదని కన్నీటిపర్యంతమైంది. గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రేమ పేరిట వేధింపులు..వైద్య విద్యార్థిని సూసైడ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



