అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనుల పురోగతి పై సమావేశం.. 

నవతెలంగాణ – డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల పరిషత్ అభివృద్ధి  అధికారి కార్యాలయంలో జిల్లా పంచాయతి అధికారి చక్రవర్తి తరుణ్ కుమార్, డిస్ట్రిక్ట్  లేబర్ ఆఫీసర్ మండల ప్రత్యెక అధికారి యోహన్, యం.పి.డి.ఓ. రవీందర్ తో కలసి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వార జరుగుతున్నా పనుల పురోగతి పై వారు అడిగి తెలుసుకున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల, త్రాగు నీరు, గ్రామాలలో పారిశుద్దం అనే అంశాలపైన సమీక్ష సమావేశం నిర్వహించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వార జరుగుతున్నా పనుల పురోగతి వివరాలను అడిగి తెలుసుకుని పలు సూచనలు సలహాలు చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులు సకాలంలో త్వరగా పూర్తి చేయ్యలని అదేశించారు. అలాగే అన్ని గ్రామాలలో త్రాగు నీరు సరఫరాకు ఇబ్బంది రాకుండా అన్ని చర్యలు తెసుకోవాలని, గ్రామాలలో పారిశుద్దం పనులు సరిగా జరగాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖాధికారి రాజ గంగారం, పి.ఆర్. ఎ.ఇ. శ్రీధర్, అన్ని గ్రామాల స్పెషల్ అదికారులు, పంచాయతి కార్యదర్శులు, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
Spread the love