జీ 20 సదస్సులో మెగా హీరో రామ్ చరణ్

నవతెలంగాణ – జమ్మూకశ్మీర్
జమ్మూకశ్మీర్ లోని శ్రీనగర్ లో జరుగుతున్న సదస్సులో మెగా హీరో రామ్ చరణ్ పాల్గొంటారు. ఇందుకోసం ఇప్పటికే రామ్ చరణ్ శ్రీనగర్ కు చేరుకున్నారు. టూరిజం వర్కింగ్ గ్రూప్ మీట్ లో ఆయన అంతర్జాతీయ ప్రతినిధులతో భేటీ అవుతారు. సాయుధ దళాల సెక్యూరిటీ మధ్య ఈ మీట్ అట్టహాసంగా ప్రారంభమైంది. వివిధ దేశాల నుంచి వచ్చిన సెలబ్రెటీలు ఈ సమావేశంలో ఫిల్మ్ టూరిజం, ఎకో ఫ్రెండ్లీ టూరిజంపై చర్చించనున్నారు. జమ్మూకశ్మీర్ లో అందుబాటులో ఉన్న అవకాశాలు, ప్రోత్సాహకాలపై చర్చ జరగనుందని అధికారులు తెలిపారు. మన దేశంలో టూరిజం పరంగా ముఖ్యమైన జమ్మూకశ్మీర్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో సినిమా షూటింగ్ ల కోసం సింగిల్ విండోను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. కాగా, ఈ సదస్సుకు ధర్మం, నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులు కూడా హాజరయ్యారు.

Spread the love