గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించాలి: మంత్రి శ్రీధర్ బాబు

నవతెలంగాణ – మల్హర్ రావు
పెద్దపల్లి ఎంపీగా యువ నాయకుడు గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ నాయకులకు  పిలుపునిచ్చారు. శనివారం మంథని పట్టణంలోని శివ కిరణ్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మాజీ స్పీకర్ శ్రీపాదరావు  25వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తోపాటు చెన్నూర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు గడ్డం వివేక్ వెంకట స్వామి, గడ్డం వినోద్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మన్ కుమార్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా  శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. యువత అండగా నిలబడి. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. రాబోయే నెల రోజులపాటు ప్రతి కార్యకర్త కష్ట పడి పనిచేయాలని చెప్పారు. వీధి కుక్కల మాదిరిగా కొందరు మొరుగుతున్నారని.. వారిని పట్టించుకోవొద్దన్నారు. మంథనీలో అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని, మా నాన్న శ్రీపాదరావు  ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్నానని మంత్రి  శ్రీధర్ బాబు  చెప్పారు.
Spread the love