ఓటు వేసిన ప్రముఖులు..మంత్రులు..

నవతెలంగాణ హైదరాబాద్: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ రహీంపురాలోని ఎస్ఎస్కే డిగ్రీ కాలేజీలోని పోలింగ్ బూత్ లో ఓటు వేసిన గోశామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని బూత్ నెంబర్ 99 లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి. బంజారాహిల్స్ ఎన్.బీ.టీ నగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు, నగర మేయర్ విజయలక్ష్మి బంజారాహిల్స్ ఎన్.బీ.టీ నగర్ లోని పోలింగ్ సెంటర్ ని సందర్శించిన సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ సనత్ నియోజకవర్గం మొండా మార్కెట్ డివిజన్ లోని ఇస్లామీయ హై స్కూల్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న సికింద్రాబాద్ పార్లమెంట్ బి.ఆర్.ఎస్ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Spread the love