ఇందల్ వాయి మండలంలోని ఏల్లారెడ్డి పల్లి గ్రామంలో ఆదివారం ప్రమాదవశాత్తు చెక్ డ్యామ్ లో పడి మృతి చెందిన కాంగ్రెస్ కార్యకర్త గుర్రాల ప్రశాంత్ అంతిమ యాత్రకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సోమవారం పాల్గొన్నారు.మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులకు అడిగి తెలుసుకుని వారికి మనోధైర్యం కల్పించి ఎల్లవేళలా అండగా ఉంటామని వారికి భరోసా కల్పించారు. ఎన్నికల సమయంలో ప్రశాంత్ చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీకి ఓట్లను వేయించారన ఎమ్మెల్యే వివరించారు. గుర్రాల ప్రశాంత్ లేని లోటు తీర్చలేనిదని ఒక మంచి యూవ కార్యకర్తను పార్టీ కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే వేంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్, డిసిసి డెలిగేట్ సుధాకర్, వెంకట్ రెడ్డి,ఎన్ ఎస్ యుఐ రూరల్ కన్వీనర్ ఆశిష్, కర్స మోహన్, తో పాటు నాయకులు కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.