Sunday, May 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన బోర్ వెల్ బండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

నూతన బోర్ వెల్ బండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి : వనపర్తి మండలం చిట్యాల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘుపతిరావు నూతనంగా కొనుగోలు చేసిన బోర్వెల్స్ బండ్లను ఆదివారం వనపర్తి శాసనసభ్యు తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. గోపాల్పేట మండలం బుద్ధారం గండి ఆంజనేయ స్వామి ఆలయంలో వాహనాలకు ప్రత్యేకంగా పూజ చేశారు. ప్రారంభించేందుకు ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యేతో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఎమ్మెల్యే గారికి వేద ఆశీర్వాదాలు అందించారు. అనంతరం ఎమ్మెల్యే వాహనాలు నడిపి ప్రారంభించారు.

స్వయంకృషితో పని చేసుకునే వారు ఎవరైనా జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని చిట్యాల రఘుపతిరావు గారు సైతం ఆర్థికపురోభివృద్ధి సాధించాలని కోరారు. అనంతరం ఆలయంలో కాసేపు మండల నాయకులతో ఆయన అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గోపాల్పేట మండల మార్కెట్ యార్డు ఉపాధ్యక్షులు సత్యశ్రీలా రెడ్డి, వనపర్తి మాజీ ఎంపీపీ కిచ్చారెడ్డి, కాంగ్రెస్ నాయకులు కొంకి వెంకటేష్, కొంకి రమేష్, శివన్న, ఎస్ ఎల్ ఎన్ రమేష్, పెంటరావు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -