అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలి      

నవతెలంగాణ –  మద్నూర్ 
జిల్లాకు రాష్ట్రానికి పూర్తిగా మారుమూల ప్రాంతంలో గల వెనుకబడ్డ జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు మంత్రి పదవి ఇవ్వాలని మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆ నాయకులు మాట్లాడుతూ 1957 సంవత్సరం లో జుక్కల్ నియోజకవర్గం సెగ్మెంట్ గా ఏర్పాడింది.1978 లో జుక్కల్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం గా మారింది.అప్పటి నుండీ ఇప్పటి వరకు ఒక్కసారి ఎమ్మెల్యే కుడా మంత్రి పదవి నియోజకవర్గం కి ఎవ్వరికి రాలేకపోతుందని.ఇప్పుడున్న జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు  మాంచి విద్యావంతుడు, అనుభవం ఉన్నా వ్యక్తి కి మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అలాగే కాంగ్రెస్ పార్టీ ఐ కమాండ్ కు  మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామ్ పటేల్ , కొండావార్ గంగాధర్ , రమేష్ వట్నాల్ వార్ , రాజు తైదళ్వార్  విజ్ఞప్తి చేశారు.
Spread the love