కేసీఆర్‌‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే!

నవతెలంగాణ- హైదరాబాద్: కేసీఆర్‌పై పోలీసులకు భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫిర్యాదు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, కేసీఆర్‌‌పై కేసు నమోదు చేయాలని కోరారు. సోమవారం భద్రాచలం పోలీస్ స్టేషన్‌లో ఎస్సై మధు ప్రసాద్‌కు ఫిర్యాదును అందజేశారు. ‘‘భద్రాచలం ప్రాంత అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్నా.. ఇంతవరకు నెరవేర్చలేదు. భద్రాచలం నియోజకవర్గ ప్రజలను ఆయన మోసం చేశారు. గతంలో రామాలయ అభివృద్ధికి రూ.100 కోట్లు ప్రకటించి, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు” అని పొదెం వీరయ్య మండిపడ్డారు.
Spread the love