సాటాపూర్ గ్రామంలో గృహజ్యోతి పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే

నవతెలంగాణ – రెంజల్

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ పథకలలో భాగంగా గృహ జ్యోతి పథకాన్ని మార్చి నుంచి అమలులోకి తేలినట్లు మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రెంజల్ మండలం సాటాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గత పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలను విస్మరించారని, ఆయన ఎద్దేవా చేశారు. ప్రతి నిరుపేదకు ప్రభుత్వం ద్వారా ఆరు గ్యారెంటీ పథకాలు వర్తించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మార్చ్ ఒకటి నుంచి గృహలక్ష్మి పథకం ద్వారా ప్రతి నిరుపేదకు జీరో రీడింగ్ తో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. 200 యూనిట్ల వరకు ప్రతి కుటుంబం విద్యుత్తును వినియోగించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది అన్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వ భూములను కబ్జా చేసుకోవాలన్న తలంపుతో ధరణి పోర్టల్ తీసుకువచ్చి నిరుపేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనుంచి తాసిల్దార్ కార్యాలయంలోనే తమ భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకొని అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందన్నాడు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొబిన్ ఖాన్, స్థానిక నాయకులు జావిద్ ఉద్దీన్, సాయ రెడ్డి, ధనంజయ, గయసొద్దిన్, గంగా కృష్ణ, సిహెచ్ రాములు, ఎంఎల్ రాజు, లచేవారు నితిన్, శనిగరం సాయి రెడ్డి, సాయిబాబా గౌడ్, రవి, షౌకత్, బన్షియ నాయక్, కార్తీక్, గైని కిరణ్, వడ్డెక్క మోహన్, అగ్గు నారాయణ, సిద్ధ సాయిలు, శంషుద్దీన్, సయ్యద్ సల్మాన్ , అష్టo శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, నీరేడు సాయిలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love