
నాందేడ్ విమానాశ్రయంలో సీఎం రేవంత్ కు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఘన స్వాగతం పలికారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నాందేడ్ విచ్చేసిన వారిలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ తదితరులు ఉన్నారు.