నవతెలంగాణ – మద్నూర్
ఎస్సీ రిజర్వుడు కాన్స్టెన్సీ జుక్కల్ నియోజకవర్గం లో గల ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యల పరిష్కారానికి జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు అసెంబ్లీలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వంద పడకల ఆసుపత్రి మంజూరైన ఆ సుపత్రిలో వైద్యుల నియామకం ఇతర సిబ్బంది నియామకం చేపట్టాలని కోరారు. దాదాపు 18 మంది వైద్యులు ఇతర సిబ్బంది నియామకాలు చేపట్టవలసి ఉందని, మారుమూల నియోజకవర్గ ప్రజల వైద్య సౌకర్యాల కోసం, ప్రభుత్వం సహకరించాలని అసెంబ్లీలో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడం ఎమ్మెల్యే మొట్టమొదటిసారిగానే, ముఖ్యమైన సమస్య ప్రభుత్వ దృష్టికి అసెంబ్లీ సాక్షిగా తీసుకువెళ్లడం ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ఎమ్మెల్యే తీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు.