నవతెలంగాణ – భువనగిరి రూరల్
ప్రభుత్వ,మండల పరిషత్, జిల్లా పరిషత్, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్,కాలేజీల ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థి సంఘాలు కలిసి వారి సమస్యలు, పాఠశాలల, కళాశాలల సమస్యలను చర్చించడానికి, తెలుసుకోవడానికి నర్సిరెడ్డి మండల కేంద్రాలను సందర్శించినట్లు టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి కే రాజగోపాల్ మంగళవారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం గం.11 నుండి 12 వరకు బొమ్మలరామారం మండల పరిషత్ కార్యాలయం లో, మధ్యాహ్నం గం. 1 నుండి 2 వరకు తుర్కపల్లి మండల పరిషత్ కార్యాలయం, మధ్యాహ్నం గం. 3 నుండి 4 వరకు యాదగిరి గుట్ట మండల పరిషత్ కార్యాలయం, సాయంత్రం గం. 5 నుండి 6 వరకు భువనగిరి మండల పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఉంటారని భువనగిరి మండల అధ్యక్ష కార్యదర్శులు మురళి,సత్తిరెడ్డి లు తెలిపారు.