డప్పు దరువులతో ఎమ్మార్పీఎస్ సంబరాలు..

MMRPS celebrations with drums..నవతెలంగాణ – రెంజల్ 

రెంజల్ మండలం నీలా గ్రామంలో ఎస్సీ వర్గీకరణ స్వాగతిస్తూ డప్పు తరువులతో ఎమ్మార్పీఎస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. 30 సంవత్సరాల సుదీర్ఘమైన ఉద్యమాలతో ముందుకు సాగిన ఎమ్మార్పీఎస్ కల నెరవేరిందని వారు స్పష్టం చేశారు. గ్రామంలోని ప్రధాన వీధులకుండా డప్పు దరువులతో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ గారి భూమయ్య, జిల్లా సహాయ కార్యదర్శి బండారి పోశెట్టి, స్థానికులు వినోద్ ,లాలు, ఎమ్మార్పీఎస్ మండల నాయకులు నరేష్, రవి, శ్రీను, గంగాధర్, సైదులు, రాములు, నరసన్న, బండారి లక్ష్మవ్వ, బాలమణి, పోసాని, సాయమ్మ, మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love