అయోధ్యకు వెళ్లొద్దు..కేంద్ర మంత్రులకు మోడీ సూచన

నవతెలంగాణ-హైదరాబాద్ : అయోధ్యలో నూతనంగా ప్రతిష్ఠించిన బాలరాముడిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తడంతో విపరీతమైన రద్దీ నెలకొంది. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన కేబినెట్‌ మంత్రులకు కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. రద్దీ దృష్ట్యా ప్రస్తుతానికి అయోధ్య దర్శనాన్ని వాయిదా వేసుకోవాలని కోరినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘‘అయోధ్యలో రద్దీ ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వీఐపీ ప్రోటోకాల్స్‌ వారికి అసౌకర్యం కలిగిస్తాయి. అందువల్ల కేంద్రమంత్రులు మార్చిలో బాలరాముడిని దర్శించుకుంటే మంచిదని భావిస్తున్నా. ప్రస్తుతానికి మీరు అక్కడికి వెళ్లొద్దు’’ అని బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో మోదీ సూచించినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి.

Spread the love