- Advertisement -
ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు
పెట్రో ధరల పెంపుపై రాహుల్ ఆగ్రహం
న్యూఢిల్లీ : దేశంలో ఇంధన ధరల పెరుగుదలపై కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత తీవ్రంగా స్పందించారు. పెట్రో ధరలను పెంచిన మోడీ సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోడీ సర్కారు చేసిన తప్పిదానికి దేశ ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘‘తప్పు మోడీ సర్కారుది, మూల్యం చెల్లించేది ప్రజలు. ఇప్పటికే పెట్రోల్, డీజీల్‌లపై రూ.3 పెంచి షాక్ ఇచ్చారు. మిగిలిన ‘వసూళ్లు’ వాయిదాల పద్ధతిలో జరుగుతాయి’’ అని రాహుల్ పేర్కొన్నారు.
- Advertisement -



