నేడు మహబూబ్ నగర్ కు మోడీ

నవతెలంగాణ- హైదరాబాద్: నేడు తెలంగాణలోని మహబూబ్ నగర్ కు నరేంద్ర మోడీ రానున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ పాలమూరు పర్యటన వివరాలు రిలీజ్‌ చేశారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్‌ విమానాశ్రయానికి మోడీ రానున్నారు. 1:35కి శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో మహబూబ్‌ నగర్‌ కి మోడీ రానున్నారు. మధ్యాహ్నం 2:05 గంటలకు పాలమూరుకు ప్రధాని చేరుకుంటారు. 2:15 నుంచి 2:50 వరకు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల వరకు పాలమూరు ప్రజా గర్జన పేరిట బీజేపీ నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారు.

Spread the love