రుతుపవనాలు లేట్‌

– జూన్‌ 4న కేరళలో ప్రవేశించే అవకాశం
న్యూఢిల్లీ : కేరళలో రుతుపవనాల ప్రవేశం నాలుగు రోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. జూన్‌ 4న అవి కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ విభాగం మంగళవారం తెలిపింది. సాధారణంగా రుతుపవనాలు జూన్‌ 1న కేరళ కోస్తా తీరాన్ని తాకుతాయి. అప్పటి నుండి నాలుగు నెలల పాటు కొనసాగుతాయి. దేశంలో 75% వర్షాలు ఈ కాలంలోనే కురుస్తాయి. గడచిన ఐదు సంవత్సరాలలో కేవలం ఒక సందర్భంలో మాత్రమే (2020లో) రుతుపవనాలు జూన్‌ 1న కేరళలో ప్రవేశించాయి. 2018, 2022 సంవత్సరాలలో రెండు రోజులు ముందుగా మే 29నే వచ్చాయి. 2019, 2021లో మాత్రం కొద్ది రోజులు ఆలస్యమైంది.
రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు కాగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర, ఈశాన్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుంటే మిగతా జిల్లాల్లో సాధారణం కన్నా ఒకటి నుంచి రెండు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్టు హైదారాబాద్‌ వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్‌ నాగరత్న తెలిపారు.

Spread the love