తల్లి పాలు బిడ్డకు సంజీవని 

Mother's milk is life for the baby– భీంగల్ ఏసిడిపిఓ జ్ఞానేశ్వరి 
నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
పుట్టిన బిడ్డకు తల్లిపాలు అమృతం లాంటిదని,బిడ్డలు ఆరోగ్యంగా ఉండేందుకు తల్లిపాలు సంజీవనిల పనిచేస్తాయని భీంగల్ ఏసిడిపిఓ జ్ఞానేశ్వరి అన్నారు. శనివారం మండలంలోని బషీరాబాద్, ఉప్లూర్ గ్రామాల్లోని అంగన్వాడి కేంద్రాల్లో ఐసిడిఎస్ భీంగల్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలలో భాగంగా అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించారు. బషీరాబాద్ ఉన్నత పాఠశాల ఆవరణలోని అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన అన్నప్రాసన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏసిడిపిఓ జ్ఞానేశ్వరి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బాలింతలు మహిళలకు  ముర్రుపాల, తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి తల్లిపాలు చాలా కీలకమన్నారు. ఆరు నెలల వరకు బిడ్డ శారీరక అవసరాలన్నీ తల్లిపాల వారిని తీరుతాయన్నారు. అందుకే తల్లిపాలను బిడ్డకు సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారని వివరించారు. పూత పాల కన్నా తల్లిపాలు తాగే పిల్లలు బలంగా తెలివిగా ఉంటారన్నారు. శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో, రోగనిరోధక శక్తిని పొందాలంటే తప్పనిసరిగా తల్లిపాలు పట్టించాలన్నారు. తల్లిపాలతో బిడ్డకు, తల్లికి లాభాలు ఉన్నాయని తెలిపారు. బిడ్డకు పాలు పట్టడం ద్వారా ఎన్నో రకాల వ్యాధుల నివారణకు దోహదపడుతుందన్నారు. మురుపాల ప్రాముఖ్యత బిడ్డకు ఎంత వయసు వచ్చే వచ్చేవరకు తల్లిపాలు ఇవ్వాలి, రోజుకు ఎన్నిసార్లు పాలు పట్టాలనే తదితరు అంశాలపై గర్భిణీలు, బాలింతలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆరు నుండి ఏడు నెలలు నిండిన పలువుర చిన్నారులకు అన్నప్రాసన చేచేయించారు. కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు సరిత, మంజుల, అరుణమాల, పద్మ, ప్రణవ, సువర్ణ, ఆయాలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love