రెంజల్ మండలం దూపల్లి గ్రామంలో 2000 సంవత్సరంలో విద్యుత్ పోరాటంలో అమరులైన విష్ణువర్ధన్ రెడ్డి, రామకృష్ణ, బాల స్వాములకు సీపీఐ (ఎం ఎల్) మాస్ లైన్ ప్రజా పంత ఆధ్వర్యంలో సంతాప సభను నిర్వహించారు. మాస్ లైన్ సహాయ కార్యదర్శి ఎస్కె నసీర్ మాట్లాడుతూ నేటికి 24 సంవత్సరాలు ఆనాటి చంద్రబాబు నాయుడు ఆయన ప్రపంచ ఏజెంట్గా మారి సామాన్య ప్రజానీకంపై విద్యుత్ చార్జీలను పెంచగా వివిధ కమ్యూనిస్టు పార్టీల నాయకులు దానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయగా పోలీసుల లాఠీ చార్జీలలో పై వరు అమరులయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమయ్యిందని, హామీలు నెరవేర్చలేని ఎడల తాము పెద్ద ఎత్తున ఆందోళన చేపడతమని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్కే నశీర్, కే గంగాధర్ జిల్లా నాయకులు, మల్లేష్ డివిజన్ నాయకులు, ఎల్ గంగాధర్, పసుల గోపాల్, సిద్ధ పోశెట్టి, దేవన్న గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.