
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గత వారంలో స్వచ్ఛతనం కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగిందనీ, ఎంపీడీవో వెంకటేష్ జాదవ్ పేర్కొన్నారు. ఇక పచ్చదనంలో భాగంగా మండలానికి 70 వేల మొక్కలను నాటడానికి ప్రణాళికలను సిద్ధం చేశామని, ప్రతి గ్రామానికి 4 వేల మొక్కల చొప్పున 17 గ్రామ పంచాయతీల పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ అధికారులు, సిబ్బందితోపాటు, గ్రామ గ్రామ కార్యదర్శులు మొక్కలు నాటే కార్యక్రమంలో చురుకుగా పాల్గొనాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమాన్ని మండలంలో విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు తమ సాయ సహకారాలు అందించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ శ్రీనివాస్, ఏపీఓ రమణ, గ్రామ కార్యదర్శి రాజేందర్ రావు, ఈసీ శరత్ చంద్ర, సాంకేతిక నాయకులు రాజేశ్వర్, క్షేత్ర సహాయకులు శోభన్ తదితరులు పాల్గొన్నారు.