తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: ఎంపీడీవో

నవతెలంగాణ – రెంజల్ 

మండలంలో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాస్ స్పష్టం చేశారు. శుక్రవారం రెంజల్ మండలం లోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డబ్ల్యూఎస్ అధికారుల సమక్షంలో గ్రామ కార్యదర్శులకు తాగునీటి సమస్యపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీటి సరఫరాను నిరాటకంగా కొనసాగించాలని వారన్నారు. గ్రామాలలో తాగునీటి సమస్య తలెత్తినట్లు తమ దృష్టికి వస్తే అట్టి కార్యదర్శి పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గౌస్ అద్దం, ఆర్డబ్ల్యూఎస్ డిఈ ముని నాయక్, ఏ ఈ గబ్బర్ సింగ్, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.
Spread the love