జూన్ 26 నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్

నవతెలంగాణ – హైదరాబాద్
తెలంగాణలో ఎంసెట్ కౌన్సిలింగ్ పై కీలక ప్రకటన వెలువడింది. జూన్ 26 నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ను ఖరారు చేశారు. మొదటి విడతలో జూన్ 26 – నుంచి జూలై 5 వరకు సర్టిఫికెట్స్ పరిశీలనకు స్లాట్ బుకింగ్. జూన్ 28 – జూలై 6 వరకు సర్టిఫికెట్స్ పరిశీలన. జూన్ 28 – జూలై 8 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు. జూలై 12న సీట్ల కేటాయింపు. రెండో విడత జులై 21 నుంచి 31 వరకు, చివరి విడత ఆగస్టు 2 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. ఇక ఇది ఇలా ఉండగా, నేడు దేశవ్యాప్తంగా యూపీఎస్పీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. మొదటి సెషన్ ఉదయం 9:30 నుంచి 11:30 వరకు జనరల్ స్టడీస్, రెండో సెషన్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 4:30 వరకు సి శాట్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఫోటో, ఐడి ప్రూఫ్ ను తీసుకురావాలని అధికారులు తెలిపారు. కేవలం బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే వాడాలి. పరీక్ష ప్రారంభమైన తర్వాత లోపలికి అనుమతించరు.

Spread the love