Wednesday, June 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅటవీ ప్రాంతమైనా అక్షరాస్యతలో ములుగు ముందంజ

అటవీ ప్రాంతమైనా అక్షరాస్యతలో ములుగు ముందంజ

- Advertisement -

ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 50 సైకిళ్లు పంపిణీ
‘అమ్మకు అక్షరమాల’తో మహిళల్లో విద్యా చైతన్యం
సేవా కార్యక్రమాలతో సమాజంలో వెలుగులు నింపాలి :
మంత్రి దనసరి అనసూయ సీతక్క


నవతెలంగాణ – ములుగు
వెనుకబడిన, అటవీ ప్రాంత జిల్లాగా పేరుగాంచిన ములుగు జిల్లా విద్యా రంగంలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందని, విద్యార్థు ల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చని మంత్రి దనసరి సీతక్క అన్నారు. మంగళవారం ములుగు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యం లో, రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ సహకారంతో జిల్లా వ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు 50 సైకిళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భం గా మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి హాజరై విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసి మాట్లా డారు. ములుగు జిల్లా నిరక్షరాస్యత అధికం గా ఉన్న వెనుకబడిన జిల్లా అయినప్ప టికీ జిల్లా అధికారులు, విద్యాశాఖ సిబ్బంది, ఉపా ధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల సమిష్టి కృషి ఫలితంగా ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో 99.30 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో మొదటి స్థానం, ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రంలో రెండో స్థానం సాధిం చడం గర్వ కారణమని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో మొదటి మూడు స్థానాల్లో నిలి చిన విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ సెంట్రల్ సహకారంతో 50 సైకిళ్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.

ప్రభు త్వం చేపట్టిన ‘అమ్మకు అక్షరమాల’రాష్ట్రంలో మహిళా అక్షరాస్యతకు కొత్త దిశానిర్దేశం చేస్తోందన్నారు. చదువు రాని 12 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులను గుర్తిం చామని, మొదటి విడతగా 6లక్షల మందికి లిటరసీ పరీక్షలు నిర్వహించగా 83.33 శాతం మంది ఉత్తీర్ణత సాధిం చడం విశేషమ న్నారు. ఇప్పుడు మరో 6లక్షల మందిని పరీక్షలకు సిద్ధం చేస్తున్నా మని, భవిష్యత్తులో వారందరినీ పదో తరగతి పరీక్ష లకు కూడా సిద్ధం చేసే కార్యాచరణ చేపడు తున్నామని తెలిపారు.కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవ రావు మాట్లాడుతూ రాబోయే విద్యా సంవత్స రంలో 100 శాతం ఉత్తీర్త సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతామని తెలిపారు. కార్యక్ర మంలో గ్రంథాలయ సంస్థ చైర్మెన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కళ్యాణి, మున్సిపాలిటీ చైర్‌ పర్సన్ చింత నిప్పుల చంద్రకళ, వైస్ చైర్‌ పర్సన్ ఆసియా షాహిన్, డీఈఓ సిద్ధార్థ రెడ్డి, డీఐఈఓ వీరేంద్ర కుమార్, రోటరీ క్లబ్ ప్రతినిధులు చంద్రమౌళి, గణేష్, ఇతర సభ్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -