చేర్యాలలో బ్యాంకు ఎదుట మహిళల నిరసన
నవతెలంగాణ-చేర్యాల
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని దానంపల్లి గ్రామ డ్వాక్రా మహిళా సంఘాల సీఏలు, గ్రామైక్య సంఘం బాధ్యులు కలిసి భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకు ఎదుట జాతీయ రహదారిపై మహిళా సంఘాలు మంగళవారం బైటాయించి నిరసన, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ.. దానంపల్లి సీఏ లింగాల మమత, గుర్జకుంట సీఏ పాముల రాధిక, గ్రామైక్య సంఘాల సీసీ మాదాసు దేవయ్య కలిసి సంఘం అధ్యక్ష కార్యదర్శులు.. సభ్యుల ప్రమేయం లేకుండా నిరక్షరాస్యులైన మహిళల సంతకాలు ఫోర్జరీ చేసి, మరికొన్ని గ్రూపుల్లో లోన్లు మంజూరు చేస్తామని పెద్ద మొత్తంలో డ్రా చేసుకొని కొంత మేరకే ఇచ్చినట్టు ఆరోపించారు. ఇలా 23 మహిళా సంఘాల నుంచి ఒక్కో సంఘానికి కొన్ని లక్షల చొప్పున డ్రా చేసి సుమారు రూ.కోటి 20 లక్షల కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకొని డబ్బులు రికవరీ చేసి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సంఘటనా స్థలానికి ఎస్‌ఐ గూడ అపూర్వరెడ్డి చేరుకొని బ్యాంకు మేనేజర్ సంబంధిత అధికారులతో మాట్లాడించారు. న్యాయం జరిగే విధంగా కృషి చూస్తామని బ్యాంక్ అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
డ్వాక్రా మహిళా సంఘాల్లో భారీ కుంభకోణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



