కొండ రెడ్ల సమగ్ర అభివృద్ధే నా లక్ష్యం: గవర్నర్ తమిళసై

నవతెలంగాణ – అశ్వారావుపేట
కొండరెడ్ల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తున్నట్లు తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ అన్నారు. మండలంలోని కావడిగుండ్ల పంచాయతీలోని కొండ రెడ్డి ఆవాస మైన గోగులపూడి ని దత్తత తీసుకున్న విషయం పాఠకులకు విదితమే.  ఈ నేపద్యంలో ఆదివారం నాబార్డు 42 వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హైద్రాబాద్ నాబార్డు కార్యాలయంలో గోగులపూడి వాసి గోగులు సీతకు,డీ.డీ.ఎం సుజీత్ కుమార్,వాసన్ సంస్థ ప్రతినిధి సతీష్ కుమార్ లకు గవర్నర్ చేతులు మీదగా నిధులు మంజూరి (శాంక్షన్ లెటర్) పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అశ్వారావుపేట,దమ్మపేట మండలాల్లోని గోగులపూడి, పూచిక గుంట గ్రామాలను దత్తత తీసుకోవటం జరిగిందన్నారు.ఆ గ్రామాల్లోని కొండ రెడ్లు ను అభివృద్ధి చేయుటకు నా వంతు సహకారం అందించనున్నట్లు తెలిపారు.దీనికి నాబార్డు సహకారం అందించేందుకు ముందుకు రావటం పట్ల అభినందనీయమన్నారు. కొండ రెడ్లు కు ఉపాధి అవకాశాలు,చిరు ధాన్యాల సాగు,వారు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.అదే విధంగా గ్రామీణాభివృద్ధి వ్యవసాయ రంగాల్లో పెట్టుబడుల వల్ల ఆహారభద్రత,పోషకాహార లోపం వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు రక్త హీనత సమస్యను గుర్తించిన రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసు కుంటున్నాయన్నారు.పేదరిక నిర్మూలన,నీరు,శక్తి, వాతావరణ మార్పు,సుస్థిర వ్యవసాయ అభివృద్ధికి నాబార్డు చేస్తున్న కృషిని ప్రశంసించారు.  ఈ కార్యక్రమంలో నాబార్డు సీ.జీ.ఎం చింతల సుశీల, ఎస్బిఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ ఉంగ్రా,నాబార్డు జనరల్ మేనేజర్ అమిత్ జింగ్రా, మేనేజర్ ఉష, ఉమ్మడి ఖమ్మం జిల్లాల మేనేజర్ సుజిత్ కుమార్, వాసన్ సంస్థ ప్రతినిధి సతీష్ కుమార్, గోగులపూడి మహిళ చెల్లెమ్మ, పలువురు అధికారులు పాల్గొన్నారు.
Spread the love